ఎమ్మెల్యే గూడెం
పటాన్‌చెరు: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచించారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సునీత కృష్ణం రాజు, కృష్ణంరాజు, శ్రీధర్ చారి, నర్ర భిక్షపతి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
బసవేశ్వరుడు అందరివాడు
ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ టౌన్: సమాజంలో అనేక మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేసిన బసవేశ్వరుడు అందరివాడని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అభిప్రాయపడ్డారు. బసవేశ్వరుడి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ బసవదళ్ ఆధ్వర్యంలో పట్టణంలో బసవ మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...బసవేశ్వరుడు జగత్ గురువని, లింగాయత్ సమాజాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన మహానుభావుడన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, కులాలు, మతాల ప్రజలు కలిసిమెలసి ఉంటూ గౌరవించుకోవాలని చెప్పారని ఉద్బోధించారు. నేటి తరానికి బసవేశ్వరుడి చరిత్ర తెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ ఎం.శివకుమార్, రాష్ట్రీయ బసవదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌పాటిల్, మాజీ చైర్మన్ నరోత్తం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ, లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ షెట్కార్, ఆర్.సుభాష్ పాల్గొన్నారు.
ఆదర్శప్రాయుడు బసవేశ్వరుడు
ఆదర్శప్రాయుడు బసవేశ్వరుడు
కంగ్టి(నారాయణఖేడ్): వీరశైవ లింగాయత్ సమాజ స్థాపకులు శ్రీ బసవేశ్వరుడు అందరికీ ఆదర్శప్రాయుడని, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపి సీ్త్ర విద్యకు ప్రాధాన్యమిచ్చిన విశ్వగురు అని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి కొనియాడారు. కంగ్టి మండలంలోని చాప్టా(కే) గ్రామంలో ఆదివారం శ్రీబసవేశ్వరుని విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బసవన్న మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆచరణనీయమన్నారు. మహిళలు నిండు కలశాలతో ఆలయం నుంచి విగ్రహావిష్కరణ కూడలికి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చారు. బంజారా నృత్యాలు, బసవేశ్వరుడు, అక్కమాదేవి వేషాలంకరణలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.విజయపాల్‌రెడ్డి, ఎం.భూపాల్‌రెడ్డి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
నారాయణఖేడ్: ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఆయన ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పేదల సొంతింటి కలలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


