ప్రతీ అభ్యర్థి గంట ముందుగానే పరీక్ష
కేంద్రాలకు చేరుకోవాలి.
ఎలాంటి నిషేధిత మెటీరియల్‌ను పరీక్ష
హాల్లోకి తీసుకురాకూడదు.
పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత
అభ్యర్థులను లోనికి అనుమతించబడదు.
హాల్ టికెట్, పరీక్ష సామగ్రి వెంట
తెచ్చుకోవాలి.
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్, టెన్త్ ఓపెన్ విద్యార్థులకు సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షలు ఈ నెల 20వ నుంచి ప్రారంభమై 27వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతికి 10 పరీక్ష కేంద్రాలు, ఇంటర్మీడియెట్‌కు 18 కేంద్రాలను కేటాయించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నిమిషాల నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 7,757 మంది అభ్యాసకులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు 5,065, పదోతరగతి విద్యార్థులు 2,692 మంది ఉన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లా పరీక్ష కమిటీలతోపాటు 03 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మొబైల్ పోలీస్ స్క్వాడ్ బృందాలు, అదేవిధంగా ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్షలను ప్రశాంతంగా వ్రాసేందుకు అభ్యర్థులకు అవసరమైన తాగునీటి, వైద్య చికిత్సల నిమిత్తం ఏఎన్‌ఎమ్‌లతోపాటు వెలుతురులేమి సమస్య తలెత్తకుండా వుండేందుకు అన్ని సౌకర్యాలను కల్పించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు.
పూర్తయిన ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌కు 18,టె న్త్‌కు 10 పరీక్ష కేంద్రాలు
ఇవీ నిబంధనలు
ఏర్పాట్లు పూర్తి చేశాం
ఓపెన్ పరీక్షలను రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుంది. అభ్యాసకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించాం. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ప్రతీ కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి


