సంగారెడ్డి: మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ బీజేపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళా బిల్లుకు, డీ లిమిటేషన్‌కు సంబంధం లేదని కానీ ఆ రెండింటినీ కలిపి బిల్లుగా పెట్టాలనుకున్న బీజేపీ కుట్రను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని తెలిపారు. వచ్చే సమావేశంలో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలోనే మహిళా బిల్లు ఆమోదం పొందేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గించేలా డీలిమిటేషన్ బిల్లు పేరిట బీజేపీ కేవలం ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి


