వ్యాయామ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

వ్యాయామ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

మెదక్‌జోన్‌: వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని టీఎన్‌జీఓ భవన్‌లో వ్యాయామ ఉపాధ్యాయ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పీఈటీ జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల రాష్ట్ర పరిశీలకులుగా విద్యాసాగర్‌రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాగరాజు వ్యవహరించారు. కాగా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఏ.మధుసూదన్‌, జిల్లా కోశాధికారిగా, కే.మహిపాల్‌, మహిళా అధ్యక్షురాలిగా శారదను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ నాగరాజు, జిల్లా యువజన క్రీడా శాఖల అధికారి రమేశ్‌తో పాటు మాధవరెడ్డి, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement