ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సదాశివపేట(సంగారెడ్డి): జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌గార్డెన్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన 1982వ పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్ల తర్వాత విద్యార్థులు కలుసుకొని స్నేహితులు, గురువులతో కలిసి సమ్మేళనం నిర్వహించడం అభినందనీమయమన్నారు. అంతకుముందు ఒకరికొకరు చిన్ననాటి ఆటపాటలు స్నేహాన్ని గుర్తు చేసుకుని యోగక్షేమాలు తెలుసుకుని ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు శ్రీశైలం, ప్రభాకర్, బస్వరాజ్‌లను గౌరవించిన పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి సన్మానించి అభినందించారు.


