రక్తదానం.. ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం.. ప్రాణదానం

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

జహీరాబాద్‌ టౌన్‌: దానాల్లో కెల్లా..రక్తదానం గొప్పదని, మనమిచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుందని పలువురు పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే రక్త దానం చేసే దాతలు ఎంతో మంది ఉన్నారు. కొంత మంది అనేక సార్లు రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. జహీరాబాద్‌ పట్టణానికి చెందిన రాష్ట్రీయ బసవదళ్‌ నాయకుడు బిరిదాస్‌ నగేశ్‌ ఆదివారం లింగాయత్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో ఆయన రక్తదానం చేశారు. దీంతో ఆయన ఇప్పటి వరకు 11 సార్లు పైగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సామాజిక బాధ్యతని, తమ రక్తంతో మరొకరి ప్రాణం కాపాడామన్న తృప్తి కల్గుతుందన్నారు. కాగా ఆయనకు ఎమ్మెల్యే మాణిక్‌రావు సర్టిఫికెట్‌ అందజేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement