మిరప పంటకు తీవ్రమైన తెగుళ్లు ఏర్పడటంతో వివిధ రకాల మందులను పిచికారీ చేశాం. మూడు ఎకరాల్లో పంట సాగు చేశాను. పంటకు భారీగా పెట్టుబడి పెట్టినా అంతగా దిగుబడి మాత్రం రాలేదు. మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– రాయిపల్లి శివన్న
అధికారుల సలహాలు తీసుకోవాలి
మిరప పంటకు తెగుళ్లు రాకుండా ముందస్తుగా సంబంధిత వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. పంట దిగుబడి కోసం అధికారులు సూచించిన మందులను వాడాలి.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి


