ఇంటర్‌లో అధిక మార్కులు.. | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో అధిక మార్కులు..

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

విద్యార్థిని సన్మానించిన

భవసార్‌ క్షత్రియ సమాజ్‌

సదాశివపేట(సంగారెడ్డి): ఇంటర్‌ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి విద్యార్థిని శృతి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెతోపాటు తల్లిదండ్రులు అనిత, సంతోష్‌కుమార్‌ను ఆదివారం పట్టణంలోని భవాని మందిరంలో పట్టణ భవసార్‌ క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో భవసార్‌ క్షత్రియ సమాజం అధ్యక్షుడు చంద్రశేఖర్‌, మహిళా అధ్యక్షురాలు మాధురి, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్‌, అర్జున్‌, నర్సింగ్‌, త్రయంబక్‌, మాణిక్‌, తులసిదాస్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement