● అక్రమంగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ నిరసన ● ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ, డీ లిమిటేషన్ బిల్లులను అక్రమంగా ప్రవేశపెట్టిందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహా రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు పట్టణ జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ మూడు బిల్లులను అక్రమంగా ప్రవేశపెట్టిందన్నారు. హిందీ రాష్ట్రాల్లో 300 పైచిలుకు ఎంపీ స్థానాలను పెంచుకొని, దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 100 సీట్లు పెంచి.. ఎప్పటికీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండాలన్న తెరవెనుక కుట్రలో భాగమే డీలిమిటేషన్ అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల సీఎం మద్దతును కూడగట్టి కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును పార్లమెంట్‌లో వీగిపోయేలా చేయడంలో కీలకపాత్ర వహించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు యువరాజ్, రవి ముదిరాజ్ ,సాయిలు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


