పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు..

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

● రోడ్డు ప్రమాదంలో మృతి ● జంగరాయిలో విషాదం

● రోడ్డు ప్రమాదంలో మృతి ● జంగరాయిలో విషాదం

చిన్నశంకరంపేట(మెదక్‌): మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని జంగరాయి గ్రామానికి చెందిన పడాల విఠల్‌, లక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు వర ప్రసాద్‌(30) ఆదివారం మధ్యాహ్నం పెళ్లి పత్రికలు పంచేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. పెళ్లి దగ్గరపడటంతో సమీపంలోని గవ్వలపల్లి, అంబాజిపేట, శంకరంపేటలో పత్రికలు ఇచ్చేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శంకరంపేట నుంచి మెదక్‌ వైపు వెళ్తుండగా అంబాజిపేట వద్ద కుక్క అడ్డు రావడంతో స్కూటీ అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టాడు. దీంతో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడ్ని మెదక్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 10న వాయిదా పడిన పెళ్లి...

ఈ నెల 10న వరప్రసాద్‌ పెళ్లి జరగాల్సి ఉండగా అమ్మాయి దగ్గరి బంధువు మృతి చెందడంతో వాయిదా పడింది. తిరిగి 23న పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.

విద్యుదాఘాతంతో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ మృతి

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై లైన్‌మెన్‌ ప్రాణాలు కోల్పో యాడు. ఈ విషాద ఘటన మండలంలోని నారాయణపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హుస్నాబాద్‌కి చెందిన భూక్య సురేశ్‌(40) విద్యుత్‌ శాఖలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలోని వ్యవసా య బావుల వద్ద విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతుండటంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని రైతులు లైన్‌మెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వరికోతలు పూర్తి కావడంతో ఆదివారం విద్యుత్‌ తీగలను సరిచేసేందుకు అతడు వెళ్లాడు. లైన్‌ క్లియరెన్స్‌ తీసుకొని స్తంభంపై పని చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ రావడంతో షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement