ధర్మస్థాపనకు సంఘటితమవుదాం | - | Sakshi
Sakshi News home page

ధర్మస్థాపనకు సంఘటితమవుదాం

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

పాపన్నపేట(మెదక్‌): హిందూ ధర్మస్థాపనకు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని బ్యాతోల్‌ తిమ్మాయపల్లి గీతాశ్రమం శాంతానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ఆదివారం పాపన్నపేట లో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి విజ్ఞాన భావాలను చూపిన హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. యువతలో దేశభక్తి పెంపొందించాలని కోరారు. ధర్మం, సంస్కృతి, సమాజ నిర్మాణం వంటి అంశాలు ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్యసమాజ్‌ మెదక్‌ జిల్లా కార్యవాహ ఓంకార్‌, మహిళా ఉపన్యాసకురాలు గంగాభవాని మాట్లాడారు. హిందూసమ్మేళన కార్యనిర్వహణ అధ్యక్షుడు దుర్గేశ్‌, విభాగ్‌ కార్యవాహ నాగభూషణం, సంఘ నాయకులు తోట రవి, దుర్గేశ్‌, మనోజ్‌, వివిధ గ్రామాలకు చెందిన హిందువులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement