వేసవి తాపం తగ్గేలా..
వారం రోజులుగా సంగారెడ్డిలోఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్ వేసుకున్నప్పటికీ కూడా వేడిగాలి వస్తుండటంతో ఉష్ణతాపం భరించలేక కూలర్లు కొంటున్నారు. సంగారెడ్డిలో పలువురు కూలర్లు కొనుక్కుని తీసుకువెళ్తుండగా ‘సాక్షి’క్లిక్ మనిపించింది.
– సాక్షిస్టాఫ్ ఫొటోగ్రాఫర్,సంగారెడ్డి
పరిమళాలు వెదజల్లకపోయినా విరబూసిన గుల్‌మోహర్ పూలను చూస్తే మనసు పరవశించాల్సిందే. అల్లాదుర్గం–మెటల్‌కుంట రోడ్డుకిరువైపులా హద్నూర్, ముంగి గ్రామాల శివారులోని గుల్‌మోహర్ చెట్లకు కాసిన ఎర్రటి పుష్పాలు రోడ్డుపై రాకపోకలు సాగించే వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండి మొక్కలు, చెట్లు ఎండి ముఖం పడుతుండగా ఇక్కడ మాత్రం చెట్లకు పూసిన గుల్‌మోహర్ పూలను చూస్తూ దారిన పోయే వారు పరవశించిపోతున్నారు.
న్యాల్‌కల్(జహీరాబాద్):


