సంగారెడ్డి జోన్: ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. శనివారం తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలకు వెళ్తున్న హోంగార్డులకు మెడికల్, ప్రాథమిక అవసరాల కిట్టులను ఎస్పీ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరేందర్, పోలీసు డ్యూటీ డాక్టర్ జ్యోతి, డానియెల్, తదితరులు పాల్గొన్నారు.


