తాగునీటి కోసం గిరిజనుల ఆందోళన
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని వరిగుంతం గ్రామపంచాయతీ పరిధిలోని కుడి చెరువు తండావాసులు నీటి ఎద్దడిని నిరసిస్తూ శనివారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. వీరికి పంచాయతీ వార్డు మెంబర్లు లంబాడి రవి, పెంట్యా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తండాలో కొన్ని రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, వారంలో ఒక్కరోజు మాత్రమే ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తుండటంతో తండా వాసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామపంచాయతీలో నిధులున్నా.. బోరు వేసి నీటి సమస్య తీర్చాలని అడిగితే, సర్పంచ్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుడి చెరువు తండాలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


