మెదక్ పట్టణానికి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో మెదక్–బోధన్ రహదారి పక్కనే పోచారం అభయారణ్యం ఉంది. ఈ అడవిలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం కొనసాగుతుంది. ఇందులో కృష్ణజింకలతో పాటు, వేలాదిగా కొమ్ముల జింకలు ఉన్నాయి. ఆ అడవిలో నెమళ్లు, నీల్గాయిలు, కొడగొర్లు, జంతువులతో పాటు పక్షులు ఉన్నాయి. పర్యాటకులు తిలకించేందుకు అడవిలో 4.5 కిలో మీటర్లమేర మట్టిరోడ్డు వేశారు. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి, వీటిని తిలకించేందుకు పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 50 చొప్పున చెల్లించాలి. పక్కనే నిజాంపాలనలో పోచారం ప్రాజెక్టును సహజసిద్ధంగా వెలసిన గుట్టల మధ్య నిర్మించారు.


