మెదక్‌ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు | - | Sakshi
Sakshi News home page

మెదక్‌ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు

Apr 19 2026 1:44 PM | Updated on Apr 19 2026 1:44 PM

ఏడుపాయల దేవస్థానం

మెదక్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం ఉంది. ఒకప్పుడు భీకరమైన కీకారణ్యం అది. రుషులు తప్పస్సు చేసిన వేదభూమి, పుణ్యభూమిగా చరిత్ర చెబుతోంది. రాతిగుహల మధ్య సహజసిద్ధంగా వనదుర్గామాత వెలిసింది. కొలిసిన భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా మహాశివరాత్రికి మూడు రోజుల పాటు జాతర కన్నుల పండువగా జరుగుతుంది. అలాగే మాఘ అమావాస్య, ఉగాది పర్వదినాల్లో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడికి తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఆది, మంగళవారాల్లో వచ్చి దర్శనం చేసుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement