జహీరాబాద్ టౌన్: వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ వినయ్‌కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని దత్తగిరి కాలనీకి చెందిన రంజిత కుమార్ భార్య నాగరాణి(21) ఈ నెల 15న రాత్రి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం భర్త బంధువులను విచారించినా ఫలితం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో ఘటనలో తల్లీకూతురు..
పటాన్‌చెరు టౌన్: తల్లీకూతురు అదృశ్యమైన సంఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం... సందుగూడెంకు చెందిన అనిల్ మేసీ్త్ర పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా కర్ణాటక బీదర్‌లో ఉండే అతడి కూతురు దివ్యభారతి, భర్తతో గొడవపడి రెండు నెలల క్రితం వచ్చి తండ్రి వద్ద ఉంటుంది. ఈ నెల 6న ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి నుంచి దివ్యభారతి, కూతురు విజయలక్ష్మి(3)ని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. కూతురు, మనవరాలు అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


