అర్హులందరికీ సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

ఝరాసంగం(జహీరాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సంక్షేమాధికారి లలిత కుమారి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీ్త్ర, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మండలస్థాయి అధికారులు తమ శాఖల పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మంజుల, డిప్యూటీ తహసీల్దార్‌రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement