తాగునీటి ఎద్దడి తలెత్తనివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి తలెత్తనివ్వొద్దు

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

● ఎమ్మెల్యే సంజీవరెడ్డి

● ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌: వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్‌ పట్టణ శివారులోని కన్వెన్షన్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, కార్యదర్శులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ నిధులతోపాటు, ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, తన నిధులు తాగునీటి ఎద్దడి నివారణకు కేటాయించనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న అర్బన్‌ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుందని సంజీవరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement