నారాయణఖేడ్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారి పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో సలహా సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి మారుమూల ప్రాంతంలో ఉండడంతో స్థానిక రోగులతోపాటు పక్క నియోజకవర్గాల రోగులకు కూడా వస్తుంటారని సూచించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు నిల్వలు ఉండేలా చూస్తూ అధునాతన సేవలు అందించేందుకు తగు పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బంది సమయపాలనతో విధులకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రమేష్, కౌన్సిలర్లు, సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా జాతర నిర్వహించండి
మనూరు మండలంలోని సుప్రసిద్ధ బోరంచ నల్లపోచమ్మ జాతర ఈనెల 23వ తేదీ నుంచి 7 వారాలపాటు జరగనుంది. ఈ సందర్భంగా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. బోరంచ ఆలయం ఆవరణలో ఆలయం ఈఓ మహా రుద్రప్ప, చైర్మన్ మల్లయ్యలతోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బందితో కలిసి ఈనెల 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ప్రమాదంలో మృతిచెందిన మనూరు ఏఎస్‌ఐ గోవింద్ నాయక్ కుటుంబీకులను పరామర్శించారు.


