ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన అవసరం

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

పటాన్‌చెరు టౌన్‌: ట్రాఫిక్‌ నియమాలు పా టిస్తూ.. సురక్షితంగా ప్రయాణించాలని ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్‌ అలైవ్‌’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం బుధవారం పటాన్‌చెరు మండల పరిధిలోని నందిగామలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన తప్పనిసరి అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ తప్పనిసరిగా ధరించి, పరిమిత వేగంతో ప్రయాణించాలని సూచించారు. అతివేగం క్షణకాలం ఆనందాన్ని కలిగించినప్పటికీ, ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్‌, భానూర్‌ సీఐ విజయ్‌ కృష్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివానందం, నందిగామ సర్పంచ్‌ విక్రమ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): మండల పరిధిలోని సోమక్కపేట్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం రోడ్డు భద్ర పై అవగాహన సదస్సు నిర్వహించామని ఎంఈఓ విఠల్‌ అన్నారు. ముఖ్యఅథితిగా సర్పంచ్‌ దుర్గాచలం హాజర య్యారు. సర్పంచ్‌ను సన్మానించిన ఉపాధ్యాయ సిబ్బంది అతనికి హెల్మెట్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విఠల్‌ మాట్లాడుతూ.. అవగాహన లేకుండా వాహనాలు నడిపించడ మూలంగా, కుటుంబాలు రోడ్డున పడుతున్నా యన్నారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, జీబ్రా క్రాసింగ్‌, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ తదితర విషయాల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు.

ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

Advertisement
 
Advertisement
Advertisement