లయన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

లయన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయం

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

రూ.10 లక్షలతో పాఠశాలకు కంప్యూటర్లు, ఫర్నిచర్‌, వీల్‌చైర్‌ వితరణ

రూ.10 లక్షలతో పాఠశాలకు కంప్యూటర్లు, ఫర్నిచర్‌, వీల్‌చైర్‌ వితరణ

ములుగు(గజ్వేల్‌): లయన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కంప్యూటర్‌ నైపుణ్యాల కోసం హైదరాబాద్‌ లయన్స్‌క్లబ్‌ జూబ్లీహిల్స్‌ వైటల్‌ సభ్యురాలు అనురాధ ఆర్థిక సహకారంతో రూ. 8 లక్షలు వెచ్చించి కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. కాగా ఉపాధ్యాయుల విరాళం ద్వారా ప్రతి నెల జీతం చెల్లిస్తూ వలంటీర్‌ను నియమించి విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ ఇస్తుస్తున్నారు. అలాగే రూ.లక్షా50 వేల వ్యయంతో విద్యార్థుల కోసం అవసరమైన ఫర్నీచర్‌ను కరీంనగర్‌కు చెందిన పాస్ట్‌ కౌన్సిల్‌ లయన్‌ చైర్‌పర్సన్‌ రాజిరెడ్డి, నల్గొండకు చెందిన మోహన్‌రావు, హైదరాబాద్‌కు చెంది సూర్యరాజు, ఓబుల్‌రెడ్డి సహకారంతో సమకూర్చారు. అలియాబాద్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థికి లయన్స్‌క్లబ్‌ సహకారంతో రూ.30 వేల విలువ చేసే వీల్‌చైర్‌ను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కనకయ్య, ఎంఈఓ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ కర్ణాకర్‌రెడ్డి, క్లబ్‌ సభ్యులు అమర్‌నాథ్‌రావు, జ్యోతి, మాధవి, ప్రవీణ్‌, సంజయ్‌గుప్త పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement