ఎంపీ రఘునందన్‌రావు
మెదక్‌జోన్: వెయ్యి మంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపలేరని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం రాత్రి మెదక్‌లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్, నారీ సమ్మేళన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని, అడ్డుకుంటామంటూ సీఎం రేవంత్‌రెడ్డి అనడం సరికాదన్నారు. మహిళల ఆత్మాభిమానం కాపాడాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఇంట్లో టాయిలెట్స్ నిర్మించారని కొనియాడారు. భారత దేశాన్ని 55 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించాడు. పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాల్లో రెండు బిల్లులు ఆమోదం పొందుతాయన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీజేపీ నేతలు మల్లేశంగౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


