జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లో మంగళవారం ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 843 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండటానికి ప్రభుత్వం పెళ్లికి ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. ప్రభుత్వం పేదలు, మహిళల సంక్షేమ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇంత వరకు ఒక్కరికి కూడా బంగారం ఇవ్వలేదని విమర్శించారు. రైతు భరోసా నిధులు కూడా ఇంత వరకు పూర్తిగా విడుదల చేయలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యూనుస్, వైస్ చైర్మన్ శిరీష్, ఆర్డీఓ దేవూజా, తహసీల్దార్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ సురేశ్ షెట్కార్
తులం బంగారం ఏదీ.? : ఎమ్మెల్యే


