జాతీయ పోటీలకు విద్యార్థులు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ పోటీలకు విద్యార్థులు ఎంపిక

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

ఘనంగా జాతీయ అగ్నిమాపక దినోత్సవం

తూప్రాన్‌: జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్‌ పోటీలకు తూప్రాన్‌ బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ అనురాధ తెలిపారు. గురుకులంలో చదివే సింధూజ, ప్రసన్న గత నెలలో మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వీరిద్దరూ అండర్‌ –14 సాఫ్ట్‌బాల్‌ 69వ జాతీయ స్కూల్‌గేమ్స్‌ పోటీలకు ఎంపియ్యారు. ఈనెల 16 నుంచి ఢిల్లీలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ఎంఈఓ సత్యనారాయణ అభినందించారు.

రాష్ట్ర స్థాయి ర్యాంకర్‌కు సన్మానం

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పట్టణానికి చెందిన సంహిత ఇంటర్మీడియెట్‌లో 1000కి గాను 992 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ 5, 9వ వార్డుల కౌన్సిలర్లు మహేశ్‌ చౌహాన్‌, బాణాపురం రాజు సంహితతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆమె తండ్రి వడ్ల రాజయ్యను ఆదివారం వారి స్వగృహంలో సన్మానించారు.

వన్యప్రాణుల దాహార్తికి చర్యలు

శివ్వంపేట(నర్సాపూర్‌): భానుడి ప్రతాపంతో రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో గ్రామాల్లో నీటిఎద్దడి నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అడవిలో ఉండే వన్యప్రాణుల దాహార్తి తీర్చ డం కోసం అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి వేసవిలో మూగజీవాల దాహార్తి తీర్చడం కోసం అడవిలో ఏర్పాటు చేసిన 10 సాసర్‌ పిట్స్‌లో ప్రతిరోజూ వాటర్‌ ట్యాంకర్‌ల ద్వారా నీటిని నింపుతున్నారు. ప్రతియేటా ఫిబ్రవరి నుంచి మే చివరివరకు నీటిని సమకూర్చుతున్నట్లు బీట్‌ అధికారులు తెలిపారు. మూగజీవాల దాహార్తిని తీరుస్తున్న అటవీశాఖ సిబ్బందిని జంతు ప్రేమికులు, పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు.

పేకాట ఆడుతున్న

నలుగురి అరెస్టు

మర్కూక్‌(గజ్వేల్‌): పేకాట ఆడుతున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మండలంలోని పాములపర్తి శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దామోదర్‌ వివరాల ప్రకారం... జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, పోలీసులకు పాములపర్తి శివారులో మంగళవారం పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు వారు పేకాట స్థావరంపై దాడి చేసి అచ్చంగారి పాండురంగం, లింగాని భాస్కర్‌, నీరుడి నాగరాజు, సాయిరెడ్డి జింతేందర్‌రెడ్డిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7,200 నగదు, మూడు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రామచంద్రాపురం(పటాన్‌చెరు): బెల్‌ టౌన్‌షిప్‌లోని సీఐఎస్‌ఎఫ్‌ యూనిట్‌లో మంగళవారం జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ సోనుసింగ్‌ సికర్వార్‌ అగ్నిమాపక కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజల పాటు ప్రజల్లో అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పాఠశాలల్లో మాక్‌ డ్రిల్‌, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక ఇన్‌స్పెక్టర్‌ బీఎస్‌ బండారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement