మంచు కొండల్లో దక్షిణాది రుచులు | - | Sakshi
Sakshi News home page

మంచు కొండల్లో దక్షిణాది రుచులు

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

ప్రశాంత్‌ నగర్‌ (సిద్దిపేట): కేదార్‌నాథ్‌ దర్శనానికి వచ్చే భక్తులకు మంచు కొండల్లో దక్షిణాది రుచులను అందిస్తున్న కేదారినాథ్‌ అన్నదాన సేవా సమితి సభ్యుల కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. కేదార్‌నాథ్‌కు వెళ్లే సరుకుల లారీని మంగళవారం శరభేశ్వర ఆలయం వద్ద జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు మధుసూదన్‌ మాట్లాడారు. భక్తులకు ఇక్కడి రుచులతో భోజనం అందించడం తృప్తిగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సహకారంతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు నవీన్‌ కుమార్‌, రత్నాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement