ముప్పై ఏళ్లుగా అద్దె ఇంట్లోనే.. | - | Sakshi
Sakshi News home page

ముప్పై ఏళ్లుగా అద్దె ఇంట్లోనే..

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

చిన్నశంకరంపేట(మెదక్‌): ముప్పై ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నానని, ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో సొంతింటి కల నెరవేరనుందని నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన నాగులగారి అశోక్‌ గౌడ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. మంగళవారం శేరిపల్లి సర్పంచ్‌ సంతోష, ఉపసర్పంచ్‌ విజయ్‌కుమార్‌ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రం అతడికి అందించారు. ఈ సందర్భంగా అశోక్‌గౌడ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో తాను ఆర్‌సీసీ బిల్డింగ్‌లో అద్దెకు ఉంటున్నాననే కారణంతో ఇల్లు మంజూరు కాలేదన్నారు. తాజాగా మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌ చొరవతో పాటు గ్రామ నాయకుల కృషితో ఇల్లు మంజూరైందని తెలిపాడు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాలాజీ, భరత నర్సింహులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement