నేడు మావోయిస్టు భాగ్య అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

నేడు మావోయిస్టు భాగ్య అంత్యక్రియలు

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

ఎన్‌కౌంటర్‌తో ముగిసిన దుబ్బాక విప్లవ ప్రస్థానం

ఎన్‌కౌంటర్‌తో ముగిసిన దుబ్బాక విప్లవ ప్రస్థానం

మిరుదొడ్డి(దుబ్బాక): ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా మాచ్‌పల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య అలియాస్‌ రూపీ అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన మండలంలోని ధర్మారంలో బుధవారం జరగనున్నాయి. ఇప్పటికే మావోయిస్టు భాగ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆమె పెద్ద చెల్లెలు కవిత, తమ్ముడు కుమార్‌తో పాటు గ్రామస్తులు కాంకేర్‌ జిల్లాకు తరలివెళ్లారు. భాగ్య మృతదేహానికి కాంకేర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తీసుకురానున్నారు. కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు కన్నీటి పర్యంతంతో ఎదురు చూస్తున్నారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టు భాగ్య ఎన్‌కౌంటర్‌లో హతమవడంతో దుబ్బాక గడ్డపై పురుడు పోసుకున్న మావోల ప్రస్థానం ముగిసిందన్న చర్చలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement