రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

మరొకరికి తీవ్రగాయాలు

మరొకరికి తీవ్రగాయాలు

వర్గల్‌(గజ్వేల్‌): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మజీద్‌పల్లి శివారులో తూప్రాన్‌–గజ్వేల్‌ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. గజ్వేల్‌ మండలం బేగంపేట ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, మృతుని కుటుంబీకుల వివరాల ప్రకారం.. మండలంలోని మాదారం గ్రామానికి చెందిన నీరుడి నర్సింహులు(58), తన అన్న కొడుకు పీర్లపల్లికి చెందిన ఎర్ర మల్లేశ్‌ బైక్‌పై మంగళవారం తెల్లవారుజామున మజీద్‌పల్లి శివారు పెట్రోల్‌ బంకు వైపు నుంచి ఇంటికి వస్తున్నారు. వీరి బైకును తూప్రాన్‌ నుంచి గజ్వేల్‌ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైకు వెనక కూర్చున్న నర్సింహులు తల చిద్రమై, మెదడు రోడుపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైకు నడిపిస్తున్న మల్లేశ్‌ కాలు నుజ్జునుజ్జయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అంబులెన్స్‌లో గజ్వేల్‌కు, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నర్సింలుకు భార్య లక్ష్మి, కుమారుడు మహేశ్‌, కూతురు ప్రత్యూష ఉన్నారు. వీరి వివాహాలు అయ్యాయి. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటున్న ఆయన మృతితో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మాదారం, పీర్లపల్లి గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement