పదవ తరగతి పరీక్షలు ముగియటంతో సంగారెడ్డిలో విద్యార్థుల ఆనందం పదింతలు అయ్యింది. సంవత్సర కాలంపాటు పుస్తకాలతో కుస్తీపట్టి కష్టపడి పరీక్షలకు సిద్ధమయ్యారు. సోమవారం చివరి పరీక్ష ముగియడంతో గాలిలో ఎగిరి గంతులు వేశారు. సబ్జెక్టులన్నీ ఎలా రాశారో చర్చించుకున్నారు. తల్లిదండ్రుల ఫోన్లలో సెల్ఫీలు దిగారు. కాంటాక్ట్ నంబర్లు ఒకరికొకరు ఇచ్చుకున్నారు. అక్కడే కనిపించిన ఐస్‌క్రీమ్స్ తిన్నారు. చివరగా మళ్లీ కలుద్దాం అంటూ బై బై చెప్పుకున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి.


