సంగారెడ్డి జోన్: జిల్లాలో నిర్వహించే 8వ పోషణ్ పక్వాడ కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం పోషణ్ పక్వాడ, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన ‘రహ్–వీర్’ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలసి కలెక్టర్ 63 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 23 వరకు కార్య క్రమాలు ఉంటాయన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించిన సమయంలో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి ప్రభుత్వం ‘రహ్–వీర్’పథకం కింద రూ.25,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య


