మద్దూరు(హుస్నాబాద్): లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం దూళిమిట్ట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహ్మద్ ఆసిఫ్ వివరాల ప్రకారం... ఈ నెల 11న ఓ గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన జంగు రమేశ్ లైంగికంగా వేధించాడు. దీంతో సదరు బాలిక విషయాన్ని తన అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయంపై డయల్ 100కు కాల్ చేయడంతో బాధితురాలి ఇంటికి వెళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో కూడా ఇదే మాదిరిగా ఓ బాలికను లైంగికంగా వేధించగా కేసు నమోదు కావడంతో ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి, బెయిల్‌పై బయటకు వచ్చినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
పోక్సో కేసులో మళ్లీ అరెస్టు


