స్టేట్‌ ర్యాంకు సాధించిన సంజన | - | Sakshi
Sakshi News home page

స్టేట్‌ ర్యాంకు సాధించిన సంజన

Apr 14 2026 8:58 AM | Updated on Apr 14 2026 8:58 AM

జహీరాబాద్‌ టౌన్‌: మండలంలోని మల్‌చెల్మ గ్రామానికి చెందిన శెట్టి సంజన ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్టేట్‌ ర్యాంక్‌ సాఽధించింది. గ్రామానికి చెందిన శెట్టి రవికుమార్‌ కూతురు సంజన ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించింది. రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలవడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఆమె టెన్త్‌లో కూడా ప్రతిభ కనబర్చింది. సంజనను వీరశైవలింగాయత్‌ ఉద్యోగుల సంఘం నాయకులు శెట్టి విజయ్‌కుమార్‌ తదితరులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement