నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ | - | Sakshi
Sakshi News home page

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌

Apr 14 2026 8:58 AM | Updated on Apr 14 2026 8:58 AM

జహీరాబాద్‌ టౌన్‌: ప్రయాణికురాలు మరిచిపోయిన బ్యాగ్‌ను అప్పగించి ఆటో డ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన జహీరాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న జ్యోతి బస్టాండ్‌ వెళ్లడానికి సోమవారం ఆటోలో వెళ్లింది. అనంతరం రెండు తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయి వెళ్లిపోయింది. మండలంలోని సత్వార్‌ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఎండీ.సలాఉద్దీన్‌ ప్రయాణికురాలు బ్యాగు మరిచిపోయిందని వెంటనే పోలీసుస్టేషన్‌కు తీసు కొచ్చి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌కు ఇచ్చాడు. విచా రణ చేసిన తరువాత ఎస్‌ఐ బంగారు ఆభరణాలు, మొబైల్‌ను ప్రయాణికురాలికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు సన్మానించారు.

మేరా యువభారత్‌కు

విద్యార్థి ఎంపిక

సిద్దిపేటఎడ్యుకేషన్‌: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాల విద్యార్థి, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌ టి.సౌమ్య మేరా యువభారత్‌కు ఎంపికై ంది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన మై భారత్‌ బడ్జెట్‌ క్వెస్ట్‌ 2026లో ఆమె పాల్గొనింది. 12లక్షల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునీత పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్‌ డైలాగ్‌లో పాల్గొనే అవకాశం విద్యార్థినికి లభించినట్లు చెప్పారు. ఇందులో 2026 బడ్జెట్‌, దేశ అభివృద్ధి, యువత పాత్ర వంటి అంశాలపై చర్చించనున్నారని తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ అ యోధ్యరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు విద్యార్థిని అభినందించారు.

పురాతన శాసనం గుర్తింపు

కొల్చారం(నర్సాపూర్‌): మండలంలోని వరిగుంతం గ్రామంలో నల్లరాతి మీద చెక్కిన తెలుగు శాసనాన్ని చరిత్రకారుడు బుర్ర సంతోష్‌ గుర్తించారు. శాసనానికి సంబంధించి సోమ వారం వివరాలను తెలియజేశారు. శాసనం అచ్చు తీయగా పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీ రామోజు హరగోపాల్‌ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారన్నారు. ఎరయప్రోలు పేరు మీద వేసిన దానం గురించి శాసన పాఠం తెలుపుతుందని చెప్పారు. శోభకృత్తు, జ్యేష్ట శుద్ధ సప్తమి శనివారం రోజున వేసిన శాసనమని, ఇప్పటి కాలమానం ప్రకారం సరిపోయే తేదీ 1782 మే 18 అవుతుందన్నారు. అప్పటి హైదరాబాద్‌ సంస్థానం లేదా దక్కన్‌ సుబా పరిపాలకుడు నిజాం అసఫ్‌ జా.మీర్‌ నిజాం అలీఖాన్‌ కాలంలో వేయబడిందని పేర్కొన్నారు.

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్‌

జహీరాబాద్‌ టౌన్‌: రౌడీ షీటర్లకు సోమవారం జహీరాబాద్‌ పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టౌన్‌ ఎస్‌ఐ.వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొని భవిషత్యను నాశనం చేసుకోవద్దని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీట్‌ ఉన్నవారు ఎలాంటి కేసుల్లో తలదూర్చరాదని హితవుపలికారు. కార్యక్రమంలో ఎస్‌ఐ.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

విషాదం నింపిన

రోడ్డు ప్రమాదం

జహీరాబాద్‌ టౌన్‌: వికారాబాద్‌ జిల్లా పెద్దెముల్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమా దం ఓ కుటుంబంలో విషాదం నింపింది. రుక్మాపూర్‌లో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా స్కూటర్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. జహీరాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన కవిరాజుది నిరుపేద కుటుంబం. ఆయనకు భార్య పావని, కూతురు కీర్తన మరో బాబు ఉన్నాడు. కవిరాజు ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తుండగా భార్య మహీంద్ర అండ్‌ మహీంద్రలో కాంట్రాక్ట్‌ కార్మికురాలిగా పని చేస్తుంది. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఆదివారం స్కూటర్‌పై భార్యాపిల్లలతో కలిసి వికారాబాద్‌ జిల్లా రుక్మాపూర్‌కు వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండి సోమ వారం తిరిగి జహీరాబాద్‌కు వస్తుండగా పెద్దెముల్‌ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. కవిరాజు, భార్య పావని, కూతురు కీర్తన అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement