చేపలు పట్టేందుకు వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

చేపలు పట్టేందుకు వెళ్లి..

Apr 14 2026 8:58 AM | Updated on Apr 14 2026 8:58 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో సోమ వారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ సృజన కథనం మేరకు... గ్రామానికి చెందిన చెప్యాల సురేశ్‌(28) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇంటి వద్దనే ఉండటంతో తల్లితండ్రులకు కల్లు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిన భార్య సుప్రియ సాయంత్రం ఇంటికి వచ్చి భర్త గురించి అత్తామామలను అడగగా కల్లు తీసుకొస్తానని చెప్పి వెళ్లాడని ఇప్పటి వరకు రాలేదని చెప్పారు. దీంతో భర్త గురించి ఆరా తీయగా చెరువు వైపు వెళ్లినట్లు చెప్పారు. దీంతో చేపల వేటకు వెళ్లి ఉంటాడనుకుంది. కాగా రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో పాటు గ్రామ స్తుల సహకారంతో చెరువులో వెతకగా మృతదేహం బయటపడింది. దీంతో తన భర్త సురేశ్‌ మృతిపై అనుమానం ఉందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తన భర్తపై కల్లు దుకాణం వద్ద దాడి చేసిన బాబుపై అనుమానం ఉందని ఫిర్యా దులో పేర్కొంది.

చెరువులో గుర్తు తెలియని మృతదేహం

రామాయంపేట(మెదక్‌): మండలంలోని అక్కన్నపేట గ్రామ శివారులో ఉన్న కొత్త చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సోమ వారం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతుడికి 40 ఏళ్ల వయసుఉంటుందని, నాలుగైదు రోజుల క్రితం సదరు వ్యక్తి చెరువులో పడి ఉంటాడన్నారు. మృతదేహం కుళ్లిపోయిందని తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఐ బాల్‌రాజ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యాచకురాలు మృతి

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో యాచకురాలు మృతి చెందింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపిన వివరాల ప్రకారం... కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో యాచిస్తూ జీవనం గడుపుతున్న మద్దూరు మండలానికి చెందిన మీస లక్ష్మి(80) అనారోగ్యంతో మృతి చెందింది. మృతదేహాన్ని చేర్యాల మార్చురీకి తరలించారు.

చెరువులో శవమైన యువకుడు

Advertisement
 
Advertisement
Advertisement