గురుకుల బాలికల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

గురుకుల బాలికల ప్రతిభ

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

హీరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో గురుకుల పాఠశాల బాలికలు ప్రతిభ చాటుకున్నారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో మండలంలోని హోతి(కె)లో గల బాలికల గురుకుల పాఠశాలకు చెందిన సెకండియర్‌ విద్యార్థులు ఎంపీసీలో 1000 మార్కులకు గాను గాయత్రి 992, నిఖిత 991, మహేశ్వరి 990, స్నేహా 989, తపస్విని 988, ఐశ్వర్య, సంజనలు 986 మార్కులను సాధించారు. బైపీసీలో మెర్సీ 989, వైశాలి 988, కిరణ 985, హరిణి 983, భవానీ, నందిని 982 మార్కులను సాధించారు. ఫస్టియర్‌ ఎంపీసీలో 470 మార్కులకుగాను శ్రావణి, వైశాలిలు 463 మార్కులు సాధించగా, భవానీ 462, అంజలి 461, మనీషా 460 మార్కులను సాధించారు. బైపీసీలో 440 మార్కులకుగాను నందిని 463 మార్కులు, అశ్విత 434, మీనాక్షి 433, మహాలక్ష్మి 431 మార్కులను సాధించారు. స్రవంతి జూనియర్‌ కళాశాలకు చెందిన సబనురైన్‌ సెకండియర్‌ బైపీసీలో 991 మార్కులను సాధించారు. సీఈసీలో సంజన 978 మార్కులను సాధించగా, ఎంపీసీలో సాయిప్రసన్న 966 మార్కులను సాధించింది. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో నందిని 462 మార్కులను, సీఈసీలో అమెనాజోహా 484లను సాధించారు.

INTERMEDIATE RESULT 2026

Advertisement
 
Advertisement
Advertisement