సంగారెడ్డిలో చాలామంది వాహనదారులు సెల్‌ఫోన్ మాట్లాడుతూ బాధ్యతరాహిత్యంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సిగ్నల్ దగ్గర, ప్రధాన కూడళ్లలో, టర్నింగ్ దగ్గర సైతం ఒకచేతితో ఫోన్ మాట్లాడుతూ మరోచేతితో వాహనాన్ని నడుపుతూ వెళ్తున్నారు. దీనివల్ల ఆకస్మికంగా ఎవరైనా ఎదురొస్తే నియంత్రణ తప్పి కింద పడిపోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అడ్డొచ్చిన వారిని ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్న వాహనదారులలో మాత్రం మార్పు రావటం లేదు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సంగారెడ్డి


