● మంత్రి దామోదర రాజనర్సింహ
మునిపల్లి(అందోల్)/పుల్‌కల్(అందోల్): విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మండలంలోని మునిపల్లి, కంకోల్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల శుభకార్యాలకు మంత్రి హాజరయ్యారు. అనంతరం పుల్‌కల్ మండల పరిధిలోని ముదిమానిక్యం చౌరస్తాలో ఏర్పాటుచేసిన టీస్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్య కార్డు ఉన్నవారితోపాటు లేనివారికి కూడా ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందిస్తుందన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కొత్తకొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధితోపాటు రవాణ, ప్రయాణికుల సౌకర్యం కోసం లింకురోడ్ల అభివృద్ధితోపాటు డబుల్ రోడ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. యువకులు స్వయం ఉపాధితో ఎదగాలని మంత్రి సూచించారు.


