గిరిజన గురుకులంలో 100 శాతం | - | Sakshi
Sakshi News home page

గిరిజన గురుకులంలో 100 శాతం

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

గిరిజన గురుకులంలో 100 శాతం

కంగ్టి(నారాయణఖేడ్‌): మండలంలోని గిరిజన గురుకుల బాలుర రెసిడెన్షియల్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. సెకండియర్‌లో మనూరు మండలం మాయ్‌కోడ్‌కు చెందిన బి.ఈశ్వర్‌ సీఈసీలో 928 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఫస్టియర్‌లో జి.కార్తిక్‌ 450, ఈ.ఈశ్వర్‌ 443 మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. సీఈసీ ఫస్టియర్‌లో 17మంది, సెకండియర్‌లో 24మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement