రామచంద్రాపురం(పటాన్‌చెరు): సమాజంలో సమానత్వం, చదువు కోసం మహాత్మా జ్యోతి రావు పూలే చేసిన సేవలు ఆదర్శణీయమని పలువురు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తెల్లా పూర్‌లో మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కృష్ణ, బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వ ర్యంలో పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన పూలే చరిత్రాత్మక సంగీత నృత్య నాటకం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మనల్ని ఉన్న త స్థాయికి తీసుకెళ్లేది కేవలం విద్య ఒకటేనని వివరించారు. ప్రధానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు కొల్లూరి సత్తయ్య, మాజీ ఎంపీపీ సి.ప్రభాకర్ రెడ్డి, నాయకులు రవి, శ్రీను, సామ్రాట్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.


