నూతన నియామకం | - | Sakshi
Sakshi News home page

నూతన నియామకం

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా జంగం నగేశ్‌, కార్యదర్శిగా శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల ఆదివారం హైదరాబాద్‌లో నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యదర్శిగా మెదక్‌ జిల్లాకు చెందిన నర్సింహులు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా రాజు, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా రూపగౌడ్‌ను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ సంపత్‌స్వామి, రాష్ట్ర కార్యదర్శి యాకుబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement