సంబురం
ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు
గూడులేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగామండల పరిధిలోని భోజ్యానాయక్ తండాలో అర్హులైన శారదాబాయి, వాజీనాథ్ దంపతులకు ఇంటిని కేటాయించారు. ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, నాయకులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్, రవి పాటిల్, సుభాష్ నాయక్, వేణుగోపాల్ రెడ్డి, మారుతి రావు పాటిల్, సంగ్రామ్ పాటిల్, నవీన్ కుమార్, అమృత్, షకీల్, రాజు, తదితరులు పాల్గొన్నారు. ఝరాసంగం(జహీరాబాద్):


