జిన్నారం (పటాన్‌చెరు): నియోజకవర్గంలోని పటాన్‌చెరు, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ నెల ఒకటి నుంచి 8 వరకు పారిశ్రామిక వాడల్లో విస్తృతంగా పర్యటించి తనిఖీలు చేపట్టారు. పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని కేకేఎస్ ఆర్గానిక్స్, మంజీరా రబ్బర్ ఇండస్ట్రీస్ డివిజనల్ ఇంజనీర్ టీజీ ఎస్పీడీసీఎల్, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. చట్టబద్ధ అనుమతులు, లైసెన్సుల స్థితి, పర్యావరణ రక్షణ చర్యలు, కార్మిక నియమాలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ ఆదాయం, భద్రత నియంత్రణ, సంస్థల పనితీరు, నిర్వహణ పద్ధతులపై సమీక్షించారు. ప్రధానంగా పారిశ్రామిక సంస్థల కీలక లైసెన్సులు ఫైర్ సేఫ్టీ విభాగం లైసెన్స్, కార్మిక శాఖ లైసెన్సులు లేకుండా, భద్రతా చర్యలు పాటించకుండా స్టాక్ ఉత్పత్తి, హాజరు రిజిస్టర్లు నిర్వహణ లేనట్లు గుర్తించారు. టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో 2.65 కోట్ల 19,620 డిఫాల్టర్ల నుంచి పెండింగ్‌లో ఉందని తెలిపారు. విద్యుత్ దోపిడీ ట్యాంపరింగ్ వాటికి సంబంధించి 4,685 కేసులు ద్వారా 3.88 కోట్లు వసూలు చేయాల్సి ఉందని తనిఖీల్లో గుర్తించారు. కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పాల్గొన్న విజిలెన్స్ అండ్
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం


