గజ్వేల్: రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలపై 26 ఏళ్లుగా అధ్యయనం చేస్తూ వారికి అండగా నిలు స్తున్న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి రాజు బాటలో ఆయన కూతురు మన స్వి ముందుకు సాగుతోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇటీవలే యాక్సెంచరి సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించిన ఆమె తన మొదటి నెల వేతనంలో నుంచి రూ.25 వేలను సాయంగా అందించింది. ఆదివారం గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన తండ్రి పులి రాజుతో కలిసి జిల్లాలోని ఎల్కల్ గ్రామానికి రెండు బాధిత కుటుంబాలకు, వేలూరు, ఏటిగడ్డ కిష్టాపూర్, జాలిగామ గ్రామాలకు చెందిన మరో మూడు రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
బాధితుల కుటుంబాలకు సాయం
తన మొదటి వేతనాన్ని అందించిన మనస్వి


