పశుగ్రాసం సాగులో
పోషకాలున్న గడ్డితో పాల ఉత్పత్తి అధికం
జహీరాబాద్‌లో సాగు చేస్తున్న పశుగ్రాసం
జహీరాబాద్ టౌన్: పశుగ్రాసం అంటే పాడి రైతులకు గుర్తుకొచ్చేది చొప్ప, వరి గడ్డి తదితరవి. కానీ వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు ఉండవు. పైగా వీటికి ఖర్చు అధికం. జీర్ణం కానీ భాగం ఎక్కువ. శాసీ్త్రయ పద్ధతిలో నాణ్యమైన పశుగ్రాసం పండించి పశువులకు అందిస్తే ఆరోగ్యంగా ఉంటాయి. అధిక పాల ఉత్పత్తి సాధించడంతో పాటు పశుగ్రాసం సాగు ఖర్చు తగ్గించవచ్చు. డెయిరీ ఫారాల నిర్వహణ వ్యయంలో 70 శాతం వరకు పశువుల మేతకే పోతుంది. అందువల్ల మేత ఖర్చును తగ్గిస్తే అంత మేరకు లాభాలు పెంచుకొనే అవకాశం ఉంది. పచ్చిమేతకు అధిక ప్రాధాన్యం ఉంది. పశుగ్రాసం సాగు, ప్రయోజనాల గురించి పశుసంవర్ధక శాఖ అధికారి సునీల్‌దత్ పేర్కొన్నారు.
పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్ నేపియర్, కో 1, కో 2, ఎస్‌ఎస్‌జీ–825 రకాలు. 85 శాతం పచ్చిమేతను ఈ రకాల ద్వారా సాగు చేయవచ్చు. ఒకసారి నాటితే 4 నుంచి 5 సంవత్సరాల వరకు దిగుబడులు పొందవచ్చు.
జనవరి నుంచి ఆగస్టు వరకు విత్తనాలు విత్తుకోవచ్చు. అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆమ్ల గుణాలు గల నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది. పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతరపంటగా సాగుచేసుకోవచ్చు. ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం. మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తిన 45 రోజుల తరువాత ఎకరానికి 22 కిలోల మూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. అధిక విస్తీర్ణంలో సాగు చేసి సైలేజీ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వచేసి వాడుకోవచ్చు.
ఉపయోగాలు
సాగు విధానం ఇలా..
శాసీ్త్రయ పద్ధతిసాగుతో ప్రయోజనాలు
పచ్చిమేతలో
మాంసకృత్తులు ఎక్కువ
సైలేజ్ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వ


