రామచంద్రాపురం(పటాన్ చెరు): చెరువులను పరిరక్షించాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందని తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ అన్నారు. శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని మేళ్లచెరువును మాస్ మ్యూచువల్ సంస్థ ఉద్యోగులు, తేనా గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో చెరువు పరిసర ప్రాంతంలోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాస్ మ్యూచువల్ సంస్థ ఉద్యోగస్తులు చెరువు పరిసర ప్రాంతాల పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. చెరువులను కాపాడుకొని భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్. రమేశ్, భవాని, తేనా ప్రతినిధులు దీప్తిరెడ్డి, రవి కిరణ్, రామ్కుమార్, లావణ్య, శ్వేతారెడ్డి, దీపక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


