పూలే సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పూలే సేవలు చిరస్మరణీయం

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

సంగారెడ్డి జోన్‌: మహిళా విద్యాభివృద్ధికి మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పేర్కొన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాండు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కూన వనిత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement