సంగారెడ్డి : పట్టణంలోని రాజీవ్ పార్కు రూపు రేఖలు మారనున్నాయి. 20 ఏళ్లుగా కళావిహీనంగా ఉన్న పార్కు ఇకనుంచి అందరిని ఆకట్టుకోనుంది. మొత్తం పార్కు అభివృద్ధి కోసం రూ.3 కోట్ల సీడీఎంఏ నిధులు మంజూరయ్యాయి. ఇందులో పా ర్కుకు రూ.1.70 కోట్లు, ఫౌంటెయిన్ ఏర్పాటుకు రూ.60 లక్షలు, ఓపెన్ జిమ్ పరికరాలకు రూ.30 లక్షలు, పిల్లల ఆట పరికరాలకు రూ.32 లక్షల నిధులు కేటాయించారు. కాగా అధికారులు రెండు రోజుల్లో పనులు ప్రారంభించనున్నారు. దీంతో పార్కు అందంగా తయారు కావడమే కాకుండా పట్టణ ప్రజలకు విశ్రాంతి, వ్యాయామం, కాలక్షేపం చేసేందుకు మార్గం సుగమం కానుంది. ఎన్నో ఏళ్లుగా పట్టణ ప్రజల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చొరవతో తిరిగి రెండోసారి పార్కుకు నిధులు మంజూరయ్యాయి.
సంగారెడ్డిలోని రాజీవ్ పార్క్
మరమ్మతులకు రూ. 3కోట్లు మంజూరు
అభివృద్ధికి రూ.1.70 కోట్లు
ఫౌంటెయిన్ ఏర్పాటుకు రూ. 65 లక్షలు
త్వరలో ప్రారంభం కానున్న పనులు
పూర్తయిన టెండర్
రాజీవ్ పార్కు మరమ్మతుల కోసం టెండర్ పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం మున్సిపల్ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో మరమ్మతు పనులు ప్రారంభం కానున్నాయి.


