ధాన్యం కొంటారా.. కొనరా? | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొంటారా.. కొనరా?

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

ఎదురు చూస్తున్న అన్నదాతలు

వంగరామయ్యపల్లి కల్లంలో రైతులు ఆరబెట్టిన ధాన్యం

హుస్నాబాద్‌రూరల్‌: రైతులు వరి కోతలు మొదలు పెట్టి ధాన్యం సమీపంలోనే కల్లాల వద్ద రాశులు పోశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం వంగరామయ్యపల్లి, పోతారం(ఎస్‌) గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే కల్లాలకు ధాన్యం తెచ్చి ఆరబెట్టారు. గత ఏడాది రైస్‌ మిల్లు యాజమానులు పచ్చి వడ్లు కొనుగోలు చేయడంతో రైతులు ముందుగా కోసిన వరి ధాన్యంను మిల్లుల్లో విక్రయించేవారు. మిల్లు యాజమానులు పచ్చి ధాన్యానికి క్వింటాలుకు రూ.1,800 ధర చెల్లించడంతో రైతులు క్వింటాలుకు రూ.560 నష్టపోతున్నామని విక్రయించడం లేదు. ప్రస్తుతం త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవచ్చని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.

కల్లాలకు చేరిన ధాన్యం

Advertisement
 
Advertisement
Advertisement