సంస్థాగత వ్యవస్థ అత్యంత కీలకం | - | Sakshi
Sakshi News home page

సంస్థాగత వ్యవస్థ అత్యంత కీలకం

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

నారాయణఖేడ్‌: రాజకీయంగా, సామాజికంగా ఏదైనా సాధించాలంటే సుస్థిరమైన సిద్ధాంతంతో పాటు బలమైన సంస్థాగత వ్యవస్థ అత్యంత కీలకమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఖేడ్‌లో పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌– 2026లో భాగంగా మండల స్థాయి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... లక్ష్య సాధన కోసం కార్య విస్తరణతో పాటు సంఘటనా బలోపేతం అవసరమని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో పనిచేయడం ప్రతీ కార్యకర్తకు గర్వకారణమన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా నిలవడం ప్రధాన బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్‌, ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, రవికుమార్‌ గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షులు పత్తిరి రామకృష్ణ, నాయకులు రజినీకాంత్‌, దశరత్‌, రాజశేఖర్‌ గౌడ్‌, సాయిరాం, అనిల్‌రెడ్డి, శంకర్‌పాటిల్‌, నిజానంద్‌రెడ్డి, శ్రావణ్‌, బస్వరాజ్‌పాటిల్‌, అరుణ్‌రాజ్‌, ప్రశాంత్‌, సుగుణాకర్‌, మారుతిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement